
ఉద్యోగాలు ఇవ్వమని అడిగితే అరెస్టులు చేస్తారా అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ మండిపడ్డారు. ఈ మేరకు సీఎం జగన్ కు రామకృష్ణ లేఖ రాశారు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రతియేటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని యువతకు ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. 2.35 లక్షల ఖాళీలుంటే రెండేళ్ల లో కేవలం 10,143 ఉద్యాగాలకు జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం తగునా అని ఆయన మండిపడ్డారు.