Ram Charan Dance on Tree : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Global Star Ram Charan) నటిస్తున్న ‘పెద్ది'(Peddi Movie) చిత్రం పై రోజు రోజుకి మెగా ఫ్యాన్స్ లో అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. రంగస్థలం తర్వాత రామ్ చరణ్ ఈ చిత్రం తో మరోసారి భారీ లెవెల్ లో రీసౌండ్ వచ్చేలా హిట్ కొట్టబోతున్నాడని అభిమానులు బలంగా నమ్ముతున్నారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టే విధంగానే డైరెక్టర్ బుచ్చి బాబు ఈ చిత్రాన్ని చెక్కుతున్నాడట. ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించి 60 శాతం షూటింగ్ పూర్తి అయ్యిందట. అయితే ముందుగా ప్లాన్ చేసినట్టు మార్చి 27న ఈ సినిమా విడుదల అవ్వడం కష్టమే అని అంటున్నారు. షూటింగ్ అప్పటి లోపు పూర్తి అవ్వడం అసాధ్యం అనే టాక్ ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుంది. ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గా ఈ సినిమాకు సంబంధించిన పాట షూటింగ్ వీడియో సోషల్ మీడియా లో లీకై బాగా వైరల్ అయ్యింది.
ఈ షూటింగ్ వీడియో లో రామ్ చరణ్ ఒక కొండా లోయ అంచున, ఒక చెట్టు కొమ్మ మీద నిల్చొని డ్యాన్స్ చేయడం హైలైట్ గా నిల్చింది. మ్యూజిక్ కూడా వినసొంపుగా ఉంది. AR రెహమాన్ చాలా కాలం తర్వాత టాలీవుడ్ లో ఒక చార్ట్ బస్టర్ ఆల్బుమ్ ని అందించబోతున్నాడని ఈ చిన్న బిట్ వీడియో ని చూస్తే అర్థం అవుతుంది. మొదటి నుండి ఈ చిత్రం పై మెగా ఫ్యాన్స్ లోనే కాదు, సాధారణ మూవీ లవర్స్ లో కూడా మంచి పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. ఈ లీక్ అయినా వీడియో తో ఆ పాజిటివ్ వైబ్స్ పదింతలు ఎక్కువ అయ్యాయి. ఈసారి రామ్ చరణ్ కుంభస్థలం బద్దలు కొట్టబోతున్నాడని, ఏకంగా వెయ్యి కోట్ల గ్రాస్ ని కొల్లగొట్టి ప్రభంజనం సృష్టిస్తాడని బలమైన నమ్మకంతో ఉన్నారు ఫ్యాన్స్. అంతే కాకుండా నటుడిగా రామ్ చరణ్ ని ఒక మెట్టు పైకి ఎక్కించి, నేషనల్ అవార్డు ని తెచ్చిపెడుతుందని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.
ఇకపోతే ఈ సినిమాలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ నటిస్తుంది. బాలీవుడ్ లో ఇది వరకు ఆమె చాలా సినిమాల్లో నటించింది. కానీ ఒక్కటి కూడా కమర్షియల్ హిట్ అవ్వలేదు. కానీ టాలీవుడ్ లో ఈమె మొదటి సినిమా దేవర తోనే భారీ హిట్ ని అందుకొని తొలి హిట్ అందుకుంది. ఇప్పుడు పెద్ది తో తన హిట్ స్ట్రీక్ ని కొనసాగించాలని అనుకుంటుంది. అదే విధంగా ఈ చిత్రం లో కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ ఒక కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఆ పాత్రకు సంబందించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ని కూడా విడుదల చేశారు మేకర్స్.