Happy Birthday Hardik Pandya: హార్థిక్ పాండ్యా గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. దూకుడుగా ఆడే అతడి తీరు చాలామందికి ఇష్టం. పైగా అతని వ్యక్తిత్వం కూడా అలానే ఉంటుంది. అందువల్లే అతడు నిత్యం వార్తలో నిలుస్తూనే ఉంటాడు. పెళ్లి కాకముందే తండ్రి కావడం.. ఓపెన్ గానే తన వ్యవహారాలను బయట పెట్టడం.. భావోద్వేగాలను నియంత్రించుకోలేకపోవడం వంటి లక్షణాలు హార్దిక్ పాండ్యాను టీమిండియాలో ప్రత్యేకంగా నిలుపుతున్నాయి.
హార్దిక్ పాండ్యా మైదానంలో చాలా దూకుడుగా ఉంటాడు. బంతి వేస్తున్నప్పుడు కానీ.. పరుగు తీస్తున్నప్పుడు గానీ అతని వ్యవహార శైలి వేరే విధంగా ఉంటుంది. ముఖ్యంగా నెవెర్ బిఫోర్ షాట్లు ఆడటం అతడికి బ్యాట్ తో పెట్టిన విద్య. బంతిని చూడకుండానే సిక్సర్లు కొట్టే అతడిశైలి ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటుంది. అందువల్లే హార్దిక్ ను చాలామంది ఆరాధిస్తుంటారు. హార్దిక్ నేడు పుట్టిన జరుపుకుంటున్నాడు. ఆటగాడిగా టి20 వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ, ఆసియా కప్ వంటి వాటిలలో ముఖ్య పాత్ర పోషించాడు.. ఐపీఎల్ సారధిగా గుజరాత్ జట్టుకు టైటిల్ అందించాడు. అంతర్జాతీయ టి20 లలో ఆల్ రౌండర్ల జాబితాలో నెంబర్ 2లో కొనసాగుతున్నాడు. అన్ని ఫార్మాట్లో కలిపి అతడు 4వేలకు పైగా పరుగులు చేశాడు. 200కు పైగా వికెట్లు పడగొట్టాడు.
గత ఏడాది టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు.. దక్షిణాఫ్రికా విజయానికి దగ్గరలో ఉంది. ఆ సమయంలో క్లాసెన్ జోరు మీద ఉన్నాడు. ఈ దశలో అతడు అద్భుతమైన బంతివేసి క్లాసెన్ ను ఔట్ చేశాడు. ఇది మ్యాచ్ గతిని పూర్తిగా మార్చేసింది. అందువల్లే టీం ఇండియా విజేతగా నిలిచింది. నాటి మ్యాచ్ ను టీమ్ ఇండియా వైపు తిప్పడంలో హార్దిక్ పాండ్యా కీలక పాత్ర పోషించాడు. అప్పటి నుంచి హార్దిక్ పాండ్యా మరింత ఫేమస్ అయిపోయాడు. భార్యతో విడాకులు తీసుకున్న సమయంలో హార్దిక్ చాలావరకు ఒత్తిడి అనుభవించాడు. ఇప్పుడు మహిక అనే మోడల్ తో రిలేషన్ కొనసాగిస్తున్నాడు. మధ్యలో జాస్మిన్ పేరు వినిపించినప్పటికీ.. అది ఊహాగానానికి మాత్రమే పరిమితం అయిపోయింది.