Prabhas Sukumar movie : ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో కొంతమంది హీరోలకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. వాళ్ల నుంచి ఒక సినిమా వస్తోంది అంటే చాలు ప్రేక్షకుల్లో ఒక అటెన్షన్ క్రియేట్ అవుతోంది. అందులో ప్రభాస్ సినిమాల కోసం ఎదురుచూసే వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇప్పటివరకు ఆయన చేసిన ప్రతి సినిమాకు యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని సెట్ చేస్తూ వచ్చాయి. ఇక ఎప్పుడు కూడా ఆయన చేయబోతున్న సినిమాల విషయంలో చాలా కేర్ఫుల్ గా వ్యవహరిస్తున్నాడు. ప్రస్తుతం ఆయన ‘రాజసాబ్ ‘ సినిమా హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్ సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఇక ఇప్పటి వరకు ఎవరు ఎలాంటి సినిమా చేసిన కూడా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ ని షేక్ చేసే సినిమాలను చేయాలంటే అది కేవలం ప్రభాస్ వల్లే అవుతోంది…
ఇక ప్రస్తుతం ప్రభాస్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు. కానీ ఆ సినిమా ఇప్పుడప్పుడే పట్టలెక్కే అవకాశాలు లేనట్టుగా తెలుస్తున్నాయి. ఇక అతని స్థానంలో సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. ప్రస్తుతం సుకుమార్ రామ్ చరణ్ తో సినిమా చేస్తున్నాడు.
అలాగే ప్రభాస్ స్పిరిట్ తర్వాత కల్కి 2 చేయాలని చేస్తున్నాడు. ఇక ఆ సినిమా తర్వాత సుకుమార్ సినిమాను కూడా చేయాలని చూస్తున్నాడు. వీళ్ళిద్దరి కాంబోలో ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా రాలేదు. ఒకవేళ వస్తే మాత్రం సినిమా ఇండియన్ సినిమా ఇండస్ట్రీ ని షేక్ చేస్తోంది. రీసెంట్ గా 1850 కోట్లకు పైన కలెక్షన్స్ ను వసూలు చేసిన సుకుమార్ బాలీవుడ్లో భారీ గుర్తింపును సంపాదించుకున్నాడు.
ఇక ఇప్పుడు ఇండియాలో ఉన్న టాప్ డైరెక్టర్లలో సుకుమార్ టాప్ 3 లో ఉన్నాడని చెప్పడం లో ఎంతమాత్రం అతిశయోక్తి లేదు…ఇక ఏది ఏమైనా కూడా ప్రభాస్ సుకుమార్ కాంబోలో రాబోయే సినిమా ఏ జానర్ లో తెరకెక్కుతుంది అనేది తెలియాల్సి ఉంది…