rajyasabha
కేంద్ర ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లును వ్యతిరేకించిన రాజ్యసభ సభ్యులు సస్పెండ్ అయిన విషయం తెలిసింది. అయితే బుధవారం సాయంత్రం వీరు రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్‌ని కలువనున్నారు. వ్యవసాయ బిల్లుతో రైతులకు నష్టమే కానీ, లాభం లేదంటూ రాజ్యసభలో ఆందోళన చేసిన 8 మంది సభ్యులను డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణణ్ సోమవారం సస్పెండ్ చేశారు. మంగళవారం సస్పెండయిన సభ్యులు పలు రకాలు నిరసనలు తెలియచేశారు. అయితే బుధవారం కాంగ్రెస్ నేత గులాంనబీ చాంబర్‌లో భేటీ అయ్యారు. ఈ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం తెలుపవద్దని కోరేందుకు భేటీ కానున్నట్లు తెలుస్తోంది.
Also Read: కర్ణాటక డిప్యూటీ సీఎంకు కరోనా