Rajasthan Royals BCCI notice : ఐపీఎల్ లో వరుస విజయాలతో దూసుకుపోతోంది రాజస్థాన్ రాయల్స్. ఇప్పటికే పాయింట్ల పట్టికలో నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది రాజస్థాన్ రాయల్స్. కెప్టెన్ రియాన్ పరాగ్ సరైన స్థాయిలో ఆడలేకపోతున్నప్పటికీ.. యశస్వి జైస్వాల్, సూర్యవంశీ, జురెల్ బ్యాటింగ్ భారాన్ని మోస్తున్నారు. వీరు ముగ్గురు మైదానంలో రెచ్చిపోతున్న నేపథ్యంలో రాజస్థాన్ భారీ స్కోర్ చేస్తోంది. ఫలితంగా అన్ని మ్యాచ్లలో విజయాలు సాధించింది.
ఆర్చర్, బర్గర్, జడేజా బౌలర్లు బౌలింగ్ భారాన్ని మోస్తున్నారు. వీరు ముగ్గురు కట్టుదిట్టంగా బంతులు వేయడంతో ప్రత్యర్థి బ్యాటర్లకు పరుగులు తీయడం సులభం కావడం లేదు. దీంతో రాజస్థాన్ జట్టు ఎంతటి బలమైన జట్లనైనా సరే మట్టి కరిపిస్తోంది. అంతటి బలమైన రాజస్థాన్ జట్టు ప్రస్తుతం హైదరాబాద్ జట్టుతో తలపడుతోంది.. సోమవారం ఉప్పల్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది.
వరస విజయాలతో దూకుడు మీద ఉన్న రాజస్థాన్ జట్టుకు బిసిసిఐ చెడు వార్త చెప్పింది. దీంతో రాజస్థాన్ జట్టు లో ఆందోళన నెలకొంది.. ఇటీవల బ్యాచ్ జరుగుతున్నప్పుడు రాజస్థాన్ రాయల్స్ జట్టు మేనేజర్ సెల్ ఫోన్ పట్టుకుని వచ్చాడు. అక్కడ తన అప్డేట్స్ చూసుకుంటున్నాడు. ఇది సిసి కెమెరాలలో రికార్డు అయింది. దీంతో బీసీసీఐ క్రమశిక్షణ కమిటీ స్పందించింది. వెంటనే అతడికి షోకాజ్ నోటీస్ జారీ చేసింది. ఫోన్ ఎందుకు తీసుకొచ్చారో వివరణ ఇవ్వాలని అందులో పేర్కొంది. దీంతో రాజస్థాన్ జట్టు మేనేజర్ సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఐపీఎల్ నిర్వాహక కమిటీ నిబంధనల ప్రకారం ఆటగాళ్లు.. జట్టుతో సంబంధం ఉన్న వ్యక్తులు ఎట్టి పరిస్థితుల్లో సెల్ ఫోన్ తీసుకెళ్లకూడదు. ఎటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలు కూడా వారి వెంట ఉండకూడదు. మ్యాచ్ జరుగుతున్నంత సేపు ఎలక్ట్రానిక్ పరికరాలను ఉపయోగించకూడదు. మ్యాచ్ ముగిసిన తర్వాత వాటిని వాడాలి. ఎందుకంటే గతంలో జరిగిన పరిణామాలను దృష్టిలో పెట్టుకున్న ఐపీఎల్ నిర్వాహక కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. అంతే పకడ్బందీగా వీటిని అమలు చేస్తోంది. అందువల్లే ఎలక్ట్రానిక్ పరికరాలను తీసుకెళ్లిన వ్యక్తుల మీద కఠిన చర్యలు తీసుకుంటున్నది.