Raja Saab Movie Promo : ఏ ముహూర్తం లో ‘రాజా సాబ్'(Raja Saab Movie) మూవీ ని మొదలు పెట్టారో కానీ , ఈ చిత్రం నుండి విడుదల అవుతున్న ప్రతీ కంటెంట్ మిస్ ఫైర్ అవుతుంది. టీజర్, ట్రైలర్, పాటలు ఇలా ఒక్కటి కూడా ఈ చిత్రం పై ఆడియన్స్ లో క్రేజ్ ని తీసుకొని రాలేకపోయాయి. ఒకపక్క ఓవర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ చాలా వీక్ గా ఉన్నాయి. అవి పికప్ అవ్వాలంటే ఒక్క ప్రమోషనల్ కంటెంట్ అయినా ఆడియన్స్ కి బలంగా రీచ్ అవ్వాలి. కానీ అదే ఇక్కడ జరగడం లేదు. రీసెంట్ గా విడుదల చేసిన మెలోడీ సాంగ్ ‘సహానా..సహానా’ క్లిక్ అవుతుందేమో అని అనుకున్నారు. అది కూడా క్లిక్ అవ్వలేదు. ఇక ఇప్పుడు ‘రాజే యువరాజే’ అనే పాట ని విడుదల చేయబోతున్నారు. ఈ పాటకు సంబంధించిన ప్రోమో ని కాసేపటి క్రితమే విడుదల చేశారు.
ఈ పాట ట్యూన్ కూడా ఆకట్టుకునే విధంగా లేదు. ప్రభాస్(Rebel Star Prabhas) తన క్యూట్ చేష్టలతో కాస్త ఫన్నీ గా అనిపించాడు. హీరోయిన్ నిధి అగర్వాల్ ని పడేయడం కోసం క్రిస్మస్ తాత కి పూజలు చేస్తూ కనిపించడం చాలా సరదాగా అనిపించింది. విజువల్స్ కూడా బాగున్నాయి. ట్యూన్ ఒక్కటే తేడా కొట్టేసింది. ఈ పాట వల్ల కూడా సినిమా హైప్ పెరగడం సాధ్యం కాదు. ఈ చిత్రం పై ఆడియన్స్ కి ఒక అభిప్రాయం కలగలాఅంటే కచ్చితంగా ఒక మంచి యాక్షన్ టీజర్ కట్ రావాల్సిందే. అప్పుడే అందరిలో ఈ సినిమా పై ఆసక్తి కలుగుతుంది. ఇకపోతే ఈ సినిమా లో ఇప్పటి వరకు మూడు పాటలు విడుదల చేస్తే, అందులో రెండు పాటల్లోనూ నిధి అగర్వాల్ ఉంది. చూస్తుంటే ఈ సినిమాలో ఆమెనే మెయిన్ హీరోయిన్ లాగా అనిపిస్తుందంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
సోషల్ మీడియా లో బాగా వైరల్ అయినటువంటి ఈ ప్రోమో ని చూసి, మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ వివరాలు రేపు అధికారికంగా వెలువడే అవకాశాలు ఉన్నాయి. అమెరికా లో ఒకటి, రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ని ఏర్పాటు చేస్తున్నారట. తెలుగు రాష్ట్రాల్లో జరిగే ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో ఒక ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇకపోతే రీసెంట్ గానే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి సెన్సార్ సభ్యులు UA సర్టిఫికెట్ ని జారీ చేశారు. సినిమా నిడివి మూడు గంటల 10 నిమిషాలు ఉంటుందట.
This Christmas brings a tune to hum and a smile to share ❤️
Here’s our little Musical Surprise #RajeYuvaraje #MerryChristmas to all from the #TheRajaSaab team #TheRajaSaabOnJan9th #Prabhas @DirectorMaruthi @AgerwalNidhhi @MusicThaman @vishwaprasadtg @peoplemediafcy… pic.twitter.com/AFpViyejDD
— People Media Factory (@peoplemediafcy) December 25, 2025