
తౌక్టే తుఫాను ప్రభావంతో తెలంగాణలో దక్షిణ దిశ నుంచి బలమైన గాలులు వీస్తున్నాయి. రాష్ట్రంలో రాగల మూడు రోజుల్లో ఒకట్రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవశాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. బుధవారం రోజు ఒకట్రెండు చోట్ల 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది. తౌక్టే తుఫాను ప్రభావం రాష్ట్రానికి అంతగా లేకపోయినప్పటికీ దక్షిణ దిశగా వీస్తున్న బలమైన గాలుల కారణంగా కొన్ని జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది.