
దేశంలో కరోనా మహమ్మారి కల్లోలంతో వాయిదా పడుతున్న పరీక్షల సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. ఇప్పటికే క్లాట్ వంటి జాతీయ స్థాయి పరీక్షలు పోస్ట్ పోన్ అయ్యాయి. తాజాగా మరో ఎంట్రెన్స్ టెస్ట్ వాయిదా పడింది. ఆల్ ఇండియా లా ఎంట్రెన్స్ టెస్ట్ నేషనల్ లా యూనివర్సిటీ వాయిదా వేసింది. షెడ్యూల్ ప్రకారం ఈ పరీక్ష జూన్ 20 న జరగాల్సి ఉన్నది. కరోనా నేపథ్యంలో పరీక్షను వాయిదా వేశామని, మళ్లీ ఎప్పుడు నిర్వహిస్తామనే విషయాన్ని త్వరలో ప్రకటిస్తామని వెల్లడించింది.