
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ జమ్మూకశ్మీర్ పర్యటిస్తున్నారు. జమ్మూ ఎయిర్ పోర్ట్ నుంచి రోడ్డు మార్గం ద్వారా వైష్ణోదేవి ఆలయానికి చేరుకుని పూజలు చేశారు. తన పర్యటనలో ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదని రాహుల్ స్పష్టం చేశారు. అయితే ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూకశ్మీర్ కు రాజకీయ నేతలను పెద్దగా అనుమతించడం లేదు. ఈ విషయమై గతంలో రాహుల్ గాంధీ మోదీ ప్రభుత్వంపై విమర్శలు కూడా చేశారు.