Rahul Gandhi dictatorial attitude: రాహుల్ గాంధీ.. కాంగ్రెస్ పార్టీకి వచ్చిన లయబిలిటీ ఏంటి అంటే పాలన చరిత్రలో బాగా తప్పులున్నాయి. వారి చరిత్ర చూస్తే మాట్లాడిన తీరు చూస్తే గత చరిత్రనే కనిపిస్తోంది. కాంగ్రెస్ విధానాలు నచ్చక బయటకెళ్లి సీఎంలు అయిన వారు కూడా ఉన్నారు.
హిమంత బిశ్వశర్మ కాంగ్రెస్ లో ముఖ్య నాయకుడు. రాహుల్ గాంధీ వ్యవహారశైలి నచ్చక బయటకొచ్చాడు. కుక్క బిస్కెట్లు వేసి మాకు వేసేవాడు. అది నచ్చకనే బయటకొచ్చామని కాంగ్రెస్ పై విమర్శలు చేస్తుంటాడు. సింధియా, మిలింద్ దేవర లాటి నెహ్రూ కుటుంబ సన్నిహితులే కాంగ్రెస్ ను వీడారు. అజిత్ రంజిన్ చౌదరిని పక్కనపెట్టారు. పంజాబ్ లో సిద్దూనే వదిలేశారు.
రాహుల్ వ్యవహారశైలి వల్లే కీలక నేతలు వెళ్లిపోతున్నారు. ఏపీలో జగన్ కూడా అలానే బయటకెళ్లాడు. కాంగ్రెస్ లో ప్రతీ చిన్న విషయం రాహుల్ కు తెలియకుండా జరగదట.. అందరినీ విమర్శించే రాహుల్ ఆయన చేస్తున్నదేంటి? కోటరీ కాంగ్రెస్ లో ఉంటూ నడిపిస్తున్నాడు.
అధికారంలో లేకపోయినా రాహుల్ గాంధీవి నియంత పోకడలే.. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.
