
కోవిడ్ మహమ్మారి రెండో ప్రభంజనం వల్ల తీవ్రంగా బాధపడుతున్న ప్రజలకు అండగా ఉండాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆ పార్టీ శ్రేణులను కోరారు. రాజకీయ పనులు పక్కనబెట్టి, ప్రజలకు సేవ చేయాలని కోరారు. వ్యవస్థ విఫలమైనందువల్ల ప్రజలకు సాయపడాలన్నారు. కరోనా తరుణంలో అవసరమైన ప్రాజెక్టులపై ఖర్చులెందుకుని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.