
లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాను ఎంపీ రఘురామ కృష్ణం రాజు భార్య రమాదేవి, కుమారుడు భరత్, కుమార్తె ఇందిరా ప్రియదర్శిని కలిశారు. ఈ సందర్భంగా రాఘురామ పై ఏపీ ప్రభుత్వం కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతోందని అలాగే ఏపీ సీఐడీ చర్యలను కోర్టు ధిక్కారాన్ని ఓం బిర్లాకు వివరించారు. పార్లమెంట్ సభ్యునిగా ఉన్న వ్యక్తిన అరెస్టు చేసేముందు స్వీకర్ అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఉందని, అయితే ఎలాంటి అనుమతి తీసుకోకుండా రఘురామను అరెస్టు చేశారన్నారు. సీఐడీ కస్టడీలో ఉన్న ఆయనను చిత్రహింసలకు గురిచేశారని రఘురామ కుటుంబసభ్యులు స్వీకర్ కు ఫిర్యాదు చేశారు.