
సినిమా పైరసీ విషయంలో ఢిల్లీ హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. సినిమాను పైరసీని ప్రొత్సహించే యూజర్ల వాట్సప్ అకౌంట్లను తాత్కాలికంగా రద్దు చేయాలని సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ కు సూచించింది. రాధే సినిమా పైరసీ కాపీలను షేర్ చేసినవాళ్లతో పాటు చూసిన వాళ్ల, అమ్మిన వాళ్ల వాట్సాప్, ఇతరత్సా సోషల్ మీడియా అకౌంటన్లను సస్పెండ్ చేయాలిని ఆదేశాలు జారీ చేసింది. ఒక సినిమా విషయంలో న్యాయస్థానం ఈ తరహా ఆదేశాలు జారీ చేయడం ఇదే మొదటిసారి.