
తాను బీజేపీలో చేరటాన్ని గర్వంగా ఫీలవుతున్నానని మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ఉద్యమంలో తాము లేకుంటే కెప్టెన్ ఎక్కడుండేవాడని పరోక్షంగా కేసీఆర్ ను ఉద్దేశించి ఈటల ప్రశ్నించారు. ఆదేశాలను తాము సమర్థవంతంగా అమలు చేయకపోతే పేరు, గుర్తింపు కెప్టెన్ కు వచ్చేవి కావని ఈటల అభిప్రాయపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం పాలనను ప్రజలు అసహ్యించుకుంటున్నారని ఈటల విమర్శించారు. కొత్త రాష్ట్రంలో ఇన్ని బాధలు ఉంటాయని తెలంగాణ సమాజం ఊహించి ఉండదని ఆయన అన్నారు.