https://oktelugu.com/

శోభన్ బాబు గురించి షాకింగ్ విషయాలు !

సోగ్గాడు, అలనాటి అందాల నటుడు ‘శోభన్‌బాబు’ డబ్బు మనిషి అని పేరు ఉంది. ఇండస్ట్రీలో ఎంత డబ్బు సంపాదించుకున్నా.. పరిశ్రమకు ఆయన రూపాయి కూడా ఎన్నడూ ఖర్చు పెట్టలేదని, పైగా పారితోషికం విషయంలో పట్టువిడుపులు పాటించడనీ, నిర్మాతలను ముక్కుపిండి డబ్బులు వసూలు చేసేవాడనీ ఇలా శోభన్ బాబు గురించి చాలా విమర్శలు ఉన్నాయి. శోభన్ బాబు గురించి ఎన్ని కథనాలు ఉన్నా.. ఎప్పుడు ఆయన ఎవరిని మోసం చేయలేదు. ప్రతి ఒక్కరికి సాయం చేయకపోయినా, ఎవరిని బాధ […]

Written By:
  • admin
  • , Updated On : June 16, 2021 / 06:39 PM IST
    Follow us on

    సోగ్గాడు, అలనాటి అందాల నటుడు ‘శోభన్‌బాబు’ డబ్బు మనిషి అని పేరు ఉంది. ఇండస్ట్రీలో ఎంత డబ్బు సంపాదించుకున్నా.. పరిశ్రమకు ఆయన రూపాయి కూడా ఎన్నడూ ఖర్చు పెట్టలేదని, పైగా పారితోషికం విషయంలో పట్టువిడుపులు పాటించడనీ, నిర్మాతలను ముక్కుపిండి డబ్బులు వసూలు చేసేవాడనీ ఇలా శోభన్ బాబు గురించి చాలా విమర్శలు ఉన్నాయి.

    శోభన్ బాబు గురించి ఎన్ని కథనాలు ఉన్నా.. ఎప్పుడు ఆయన ఎవరిని మోసం చేయలేదు. ప్రతి ఒక్కరికి సాయం చేయకపోయినా, ఎవరిని బాధ పెట్టలేదు. అందుకే, శోభన్ బాబు అంటే, ఒక గౌరవం ఉండేది. కానీ శోభన్ బాబు గురించి అందరూ అనుకున్నట్టు డబ్బు మనిషి కాదు. శోభన్‌ బాబు ఎంతో మందికి గుప్తదానాలు చేసేవాడు, కాకపోతే ప్రచారం చేసుకునేవాడు. శోభన్ బాబు వల్ల లాభపడిన వాళ్లు వందల మంది ఉన్నారు.

    శోభన్‌ బాబుది పెద్ద మనసు. నిజంగా ఆయన డబ్బుకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే.. డబ్బు లేని వాళ్లతో ఎందుకు సంబంధాలు పెట్టుకుంటారు. ఆయన ఎన్నడూ తన స్థాయికి తగినవాళ్లే కోడలుగా, అల్లుళ్లుగా రావాలని ఆశించలేదు. ఆయన తన కుమార్తెలకు పెళ్లిళ్లు చేసేటప్పుడు కూడా ఆస్తి పాస్తులు ఉన్న వాళ్ళను చూడలేదు. డబ్బు లేకపోయినా బాగా చదువుకున్నవాళ్లు, బుద్ధిమంతులైన అబ్బాయిలను మాత్రమే ఆయన ఎంచుకున్నారు.

    తన కూతుళ్లు అందరికీ ఆయన మిడిల్ క్లాస్ అబ్బాయిలతోనే పెళ్ళి చేశారు. శోభన్ బాబు ముగ్గురు ఆడపిల్లలు కూడా తమ తండ్రి ఇష్టాన్ని కాదనలేదు. తమ తండ్రి ఎంపిక చేసిన వాళ్లనే పెళ్ళి చేసుకున్నారు. ఇక శోభన్‌ బాబుకు ఒక్కరే కుమారుడు. తన కొడుక్కి ఓ సాధారణ హెడ్‌ మాస్టర్ కూతుర్ని ఇచ్చి పెళ్లి చేశాడు. తన ఇంటికి కోడలిగా తెచ్చుకున్న అమ్మాయి నుండి ఒక్క రూపాయి కూడా కట్నం తీసుకోలేదు. ఈ విషయాల గురించి ఎవరికీ తెలియదు.

    శోభన్ బాబుతో వియ్యం అందుకోవడానికి ఆ రోజుల్లో కోటేశ్వర్లు క్యూలో ఉండేవారు. అయినా, ఆయన కోట్లు చూడలేదు, వ్యక్తిత్వాలు చూశారు. ఆయన పర్సనల్ జీవితంలోకి తొంగి చూస్తే.. శోభన్ బాబు పిసినారి కాదు, జాగ్రత్త పరుడు అంతే. ఇక చాలామంది హీరోలకు అందం ఉంటుంది. కానీ, అందానికి పర్యాయపదం అంటే మాత్రం శోభన్‌ బాబునే.