
ప్రధాని మోదీ ఇవాళ అమెరికా పర్యటను బయలుదేరి వెళ్లారు. అయితే ఆయన తన ట్విట్టర్ లో ఇవాళ అమెరికా టూర్ గురించి పోస్టు చేశారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆహ్వానం మేరకు తాను ఆ దేశానికి వెళ్తున్నట్లు వెల్లడించారు. రెండు దేశాల మధ్య సమగ్రమైన వాణిజ్య వ్యూహాత్మక భాగస్వామ్యం గురించి సమీక్షించునున్నట్లు మోదీ తెలిపారు.
అమెరికా పర్యటన ద్వారా వ్యూహాత్మక బంధాన్ని బలోపేతం చేయనున్నట్లు తన ట్వీట్ లో చెప్పారు. అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ తోపే ఆయన భేటీ కానున్నారు. సైన్స్ అండ్ టెక్నాటజీ రంగంలో రెండు దేశాల మద్య సకాకారంపై ఆమెతో చర్చించనున్నారు.
క్వాడ్ నేతల సదస్సులో నూ పాల్గొననున్నట్లు మోదీ తెలిపారు. అధ్యక్షుడు బైడెన్, ఆసీస్ ప్రధాని స్కాట్ మారిసన్, జపాన్ ప్రధాని మోషిహిడే సుగాలతో మోదీ భేటీ అవుతారు. ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసేందుకు స్కాట్ మారసన్, సుగాలతో వ్యక్తిగతంగా సమావేశం కానున్నట్లు ఆయన చెప్పారు. ఐక్యరాజ్యాసమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల్లో నూ ప్రసంగించనున్నట్లు తెలిపారు. కోవిడ్ 19, ఉగ్రవాదం, వాతావరణ మార్పులు లాంటి కీలక అంశాలపై చర్చించనున్నట్లు చెప్పారు.