
శనివారం సాయంత్రం జరిగిన యురోపియన్ సదస్సుకు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హాజరయ్యారు. యురోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు చార్లెస్ మిచెల్ ప్రత్యేక ఆహ్వానం మేరకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మోదీ పాల్గొన్నారు. మొత్తం 27 మంది ఈయూ సభ్యులు, దేశాధినేతలు, ఇతర పెద్దలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించారు. ఇండో- యూరోపియన్ యూనియన్ నాయకుల సమావేశాన్ని పోర్చుగల్ ప్రధాని ఆంటోనియో కోస్టా నిర్వహించారు.