
పాకిస్థాన్ లో చిక్కుకున్న తెలుగు యువకుడు ప్రశాంత్ ఎట్టకేలకు హైదరాబాద్ చేరుకున్నారు. మాదపూర్ పోలీసులు ప్రశాంత్ ను దిల్లీ నుంచి హైదరాబాద్ తీసుకొచ్చారు. సీపీ సజ్జనార్ ప్రశాంత్ ను అతని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ సందర్భంగా సజ్జనార్ మీడియాతో మాట్లాడుతూ ప్రశాంత్ విడుదలకు సహకరించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు, విదేశాంగ శాఖ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. నగరంలోని ఓ సాప్ట్ వేర్ సంస్థలో పనిచేస్తున్న ప్రశాంత్ 2019లో తన ప్రియురాలిని కలిసేందుకు వెళ్తున్న క్రమంలో పాక్ అధికారులకు చిక్కాడు. ఎలాంటి వీసా, పాస్ పోర్ట్ లేకుండా పాక్ భూభాగంలో అడుగు పెట్టడంతో అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. విదేశాంగ శాఖ సహకారంతో ప్రశాంత్ ను తిరిగి స్వదేశానికి రప్పించారు.