Prabhas leaked look : రెబల్ స్టార్ ప్రభాస్(Rebel Star Prabhas) ప్రస్తుతం చేస్తున్న చిత్రాల్లో అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా భారీ అంచనాలతో ఎదురు చూస్తున్న చిత్రం ‘స్పిరిట్’. సందీప్ వంగ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 5 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించి కేవలం ఒక్క షెడ్యూల్ ని మాత్రమే పూర్తి చేశారు. అది కూడా కేవలం నాలుగు రోజులు మాత్రమే. త్వరలోనే డెహ్రాడూన్ లో 15 రోజుల షెడ్యూల్ ని పూర్తి చేయబోతున్నాడు. అయితే అంతకు ముందు ఆయన ‘ఫౌజీ’ చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ లో ఆయన ఫుల్ బిజీ గా ఉన్నాడు. కొన్ని యుద్దపు సన్నివేశాలను ఆ చిత్ర దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కిస్తున్నాడు. ఈ క్రమంలో రీసెంట్ గానే ప్రభాస్ కి గాయాలు కూడా అయ్యాయి.
ఇదంతా పక్కన పెడితే ఈ న్యూ ఇయర్ సందర్భంగా సందీప్ వంగ ‘స్పిరిట్’ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేసిన సంగతి తెలిసిందే. శరీరమంతా గాయాలతో, కట్లు కట్టుకొని, ఒక చేతిలో మందు బాటిల్ పట్టుకొని ఉన్న ప్రభాస్ కి, ఎదురుగా నిలబడి ఉన్న హీరోయిన్ త్రిప్తి దిమిరి సిగరెట్ వెలిగించడం ఆడియన్స్ కి చాలా క్రేజీ గా అనిపించింది. వంగ మార్క్ హీరోయిజం లో ప్రభాస్ ని అలా చూడడం తో అభిమానులకు రోమాలు నిక్కపొడుచుకున్నాయి. అయితే కేవలం ఇది బ్యాక్ లుక్ మాత్రమే, ముందు వైపు నుండి ఎలాంటి లుక్ లో ప్రభాస్ ఉన్నాడు అనేది ఎవరికీ తెలియదు. నేడు సిగరెట్ వెలిగించిన తర్వాత ముందు వైపు నుండి ప్రభాస్ లుక్ లీక్ అయ్యింది. ఇంత మాస్ గా ఈమధ్య కాలం లో ప్రభాస్ ని ఏ స్టార్ డైరెక్టర్ కూడా చూపించలేకపోయారు.
చూస్తుంటే సందీప్ వంగ ప్రభాస్ తో ‘స్పిరిట్’ రూపం లో వండర్స్ క్రియేట్ చేసేలాగానే ఉన్నాడు. మీరు ఎన్ని అంచనాలు అయినా పెట్టుకోండి. ఆ అంచనాలకు మించే స్పిరిట్ చిత్రం ఉంటుంది అని చెప్పకనే చెప్తున్నాడు సందీప్ వంగ. రాబోయే రోజుల్లో ఈ సినిమా నుండి వచ్చే ప్రతీ అప్డేట్ కి సోషల్ మీడియా ఏ రేంజ్ లో బ్లాస్ట్ అవుతుందో ఊహించడానికే కష్టం గా ఉంది అంటూ సోషల్ మీడియా లో ప్రభాస్ ఫ్యాన్స్ అంటున్నారు. ఇందులో ప్రభాస్ ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడు. మెగాస్టార్ చిరంజీవి ని ప్రభాస్ తండ్రి క్యారెక్టర్ కోసం అడిగారట, కానీ చిరంజీవి మాత్రం ఒప్పుకోలేదట. ఇప్పుడు ఆ క్యారెక్టర్ మలయాళం సూపర్ స్టార్ మమ్మూటీ చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.