
దేశంలో కరోనా విలయం కొనసాగుతున్నది. నగరాలు, పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా అంతటా ఈ మహమ్మారి విస్తరించిది. ప్రస్తుతం దేశంలో ని 40 శాతం జిల్లాల్లో 20 శాతానికి పైగానే పాజిటివిటీ రేటు ఉందని కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. మొత్తం 741 జిల్లాలకు గానూ 301 జిల్లాల్లో 20 శాతం అంతకుమించి పాజిటివిటీ నమోదవుతున్నదని తెలిపింది. వాటిలో 15 జిల్లాల్లో అయితే ఏకంగా 50 శాతానికిపైగానే పాజిటివిటీ రేటు ఉందని తెలిపింది.