
లాయర్ వామన్ రావు దంపతుల హత్యకేసులో టీఆర్ ఎస్ నేత, పెద్దపల్లి జెడ్సీ చైర్మన్ పుట్ట మధును మూడు రోజుల పాటు పోలీసులు విచారించారు. పుట్టా మధు భార్య, మంథని మున్సిపల్ చైర్ పర్సన్ పుట్ట శైలజను, మార్కెట్ కమిటీ చైర్మన్ పూదరి సత్యనారాయణను కూడా పోలీసులు విచారించారు. మూడు రోజుల విచారణ తరువాత నిన్న అర్ధరాత్రి ఆయనను ఇంటికి పంపించారు. తిరిగి ఎప్పుడు పిలిచినా విచారణకు హాజరు కవాలని పోలీసులు పుట్టా మధుకు సూచించారు. కాగా మూడు రోజులు విచారణలో పుట్టా మధుకు సంబంధించిన ప్రతిదా ఎంక్వయిరీ చేశారు.