
సంప్రదాయాలకు విలువ ఇచ్చే సమాజం మనది. అలాంటిది పెళ్లి కానీ యువతులు దిగజారి ప్రవర్తించేంత స్థితికి ఇంకా చేరుకోలేదు. పెళ్లి చేసుకుంటారని, ఏదో ఒక హామీ మీద తప్పించి, సరదా కోసం ఇలా శారీరక సంబంధం పెట్టుకోరు. అలాగే నిజాన్ని నిరూపించడానికి ప్రతీసారి బాధితులు ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదు. అలా సంబంధం పెట్టుకోవాలని భావించే పురుషులెవరైనా తదుపరి పర్యవసానాలను కూడా గమనించాలి అని వ్యాఖ్యానించింది జస్టిస్ సుబోధ్ అభయంకర్ నేతృత్వంలోని బెంచ్. ఉజ్జయిని చెందిన ఓ వ్యక్తి పెళ్లి చేసుకుంటానని నమ్మించి 2018 అక్టోబరు నుంచి ఓ యువతితో శారీరకంగా కలిశాడు. అయితే పెద్దలు ఒప్పుకోవట్లేదని, తాను వేరు పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో ఆమె ఆత్మహత్య ప్రయత్నం చేసింది. యువకుడిపై అత్యాచారం కేసు నమోదు చేశారు. ఆమెకు 21 ఏళ్లు నిండాయని, ఇష్టప్రకారమే సంబంధం పెట్టుకున్నామంటూ నిందితుడు చేసిన వాదనపై కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.