Trailer Talk: యాంకర్ శ్రీముఖి కోసం కొట్టుకున్న అంకుల్స్

ప్రముఖ టీవీ యాంకర్ శ్రీముఖి అందచందాల గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. బుల్లితెరపైనే కాదు.. వెండితెరపైన కూడా శ్రీముఖి హీరోయిన్ గా ఇదివరకే ప్రయత్నించి విఫలమైంది. అయితే పట్టువదలకుండా సినిమాల్లో నటిస్తూనే ఉంది. తాజాగా శ్రీముఖి నటించిన చిత్రం ‘క్రేజీ అంకుల్స్’. ఇ. సత్తిబాబు దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో శ్రీముఖిని ప్రేమలో పడేసే అంకుల్స్ గా భరణి, రాజా రవీంద్ర, గాయకుడు మనో నటిస్తున్నారు. ఇంతకుముందు రిలీజ్ చేసిన క్రేజీ అంకుల్స్ సాంగ్ అలరించింది. తాజాగా ట్రైలర్ […]

Written By: NARESH, Updated On : August 15, 2021 2:47 pm
Follow us on

ప్రముఖ టీవీ యాంకర్ శ్రీముఖి అందచందాల గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. బుల్లితెరపైనే కాదు.. వెండితెరపైన కూడా శ్రీముఖి హీరోయిన్ గా ఇదివరకే ప్రయత్నించి విఫలమైంది. అయితే పట్టువదలకుండా సినిమాల్లో నటిస్తూనే ఉంది.

తాజాగా శ్రీముఖి నటించిన చిత్రం ‘క్రేజీ అంకుల్స్’. ఇ. సత్తిబాబు దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో శ్రీముఖిని ప్రేమలో పడేసే అంకుల్స్ గా భరణి, రాజా రవీంద్ర, గాయకుడు మనో నటిస్తున్నారు. ఇంతకుముందు రిలీజ్ చేసిన క్రేజీ అంకుల్స్ సాంగ్ అలరించింది. తాజాగా ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

ముగ్గురు అంకుల్స్ ఉంటున్న అపార్ట్ మెంట్ లోకి శ్రీముఖి హాట్ ఎంట్రీ ఇస్తుంది.ఆమెను పడేయాలని.. ఆమెను అనుభవించాలని తాపత్రయపడే అంకుల్స్ ఏమేం చేశారన్నది నవ్వులు పూయించేలా తీర్చిదిద్దారు. పక్క అపార్ట్ మెంట్ లో దిగిన గ్లామరస్ శ్రీముఖిని లైన్ లో పెట్టేందుకు ఆరాటపడే క్రేజీ అంకుల్స్ కథనే ఈ సినిమాగా తెలుస్తోంది.

శ్రీముఖిని ఇందులో అందమైన హాట్ బ్యూటీగా చూపించారు. మధ్యలో బండ్ల గణేష్ , ఔత్సాహిక దర్శకుడి పాత్రలో కమెడియన్ ప్రవీణ్ ఈ కథను చెప్పుకుంటున్న సన్నివేశాలు ఆద్యంతం నవ్వులు పంచేవిగా ఉన్నాయి. శ్రీముఖితో క్రేజీ అంకుల్స్ సీక్రెట్ రోమాంటిక్ ఎఫైర్ కథ ఏ తీరాలకు చేరిందన్నది సినిమాలో చూడాల్సిందే.

ట్రైలర్ ఆసక్తి రేపుతోంది. నవ్వులు పంచేదిగా కనిపిస్తోంది. గుడ్ ఫ్రెండ్స్, శ్రీవాస్2 క్రియేటివ్స్, బొడ్డు అశోక్ కలిసి నిర్మించిన ఈ చిత్రానికి ఈ సత్తిబాబు దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని ఈనెల 19న విడుదల చేయనున్నారు.