
చమురు కంపెనీలు వాహనదారులకు షాక్ ఇస్తున్నాయి. వరుసగా మూడో రోజు బుధవారం పెట్రోల్ , డీజిల్ ధరలను పెంచాయి. లీటర్ పెట్రోల్, డీజిల్ పై 25 పైసలు చొప్పున పెంచాయి. పెరిగిన ధరలతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.92.05 డీజిల్ ధర రూ.82.61 కు చేరింది. దేశ రాజధాని ముంబైలో పెట్రోల్ రూ.98.36, డీజిల్ రూ. 89.75 ఉంది. హైదరాబాద్ లో పెట్రోల్ రూ. 95.67, డీజిల్ రూ. 90.06 గాఉంది. ఈ నెలలో చమురు ధరలు పెరగడం ఇది ఏడోసారి. తాజా పెరుగుదలతో దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు రికార్డ గరిష్టానికి చేరాయి.