
ఆంధ్రప్రదేశ్ లో దేవాదాయ భూములు బహిరంగ వేలం వేయాలన్న ఆదేశాలను సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై మంగళవారం న్యాయస్థానం విచారణ జరిపింది. రాష్ట్రంలో కోవిడ్, కర్ఫ్యూ ఉండగా ఎలా బహిరంగ వేలం నిర్వహిస్తారని పిటిషనర్ వాదనలు వినిపించారు. పిటిషనర్ వాదనలను సమర్థించిన హైకోర్టు కోవిడ్ ఉండగా వేలం నిర్వహణ ఏంటని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దీనిపై కౌంటర్ వేయాలని ఆదేశిస్తూ తదుపరి విచారణ జూలై 7వ తేదీకి వాయిదా వేసింది.