
కృష్ణా జలాల అంశంపై తెలంగాణ హైకోర్టులో ఏపీ రైతు హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఒప్పందాలను ఉల్లంఘిస్తోందని కృష్ణా జిల్లాకు చెందిన రైతు అందులో పేర్కొన్నారు. జూన్ 28న తెలంగాణ జారీ చేసిన జీవోను సస్పెండ్ చేయాలని విజ్ఞప్తి చేశారు. విద్యుత్ ఉత్పత్తి చేస్తూ నీరు వదలడం వల్ల ఏపీకి నష్టం కలుగుతోందని పిటిషనర్ కోర్టుకు తెలిపారు.