congress bjp
కేంద్ర ప్రభుత్వం ఈ మధ్య తీసుకు వచ్చిన వ్యవసాయ బిల్లుల పై దేశ వ్యాప్తంగా రైతు సంఘాలు , విపక్షాలు నిరసన వున్నాయి. ఈ నిరసనల మధ్య రాష్ట్రపతి ఆమోదించడం బిల్లులను ఆమోదించడం అగ్గికి ఆజ్యం పోసినట్లు అయింది. ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ కేరళకు చెందిన కాంగ్రెస్ ఎంపీ టీఎన్ ప్రతాపన్ సోమవారం సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. అయితే వ్యవసాయం అనే అంశం రాష్ట్ర పరిధిలోకి వస్తుందని, కేంద్రప్రభుత్వం రాష్ట్రాల హక్కులను హరిస్తోందని ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు.రైతుల సమస్యల కోసం ప్రత్యేక ట్రైబునల్ ఏర్పాటు చేసేలా ఆదేశాలు జారీ చెయ్యాలని ఆయన కోరారు.