DK Aruna: దళితబంధును ప్రజలు నమ్మరు.. డీకే అరుణ
ఉప ఎన్నికల కోసం తెచ్చిన దళిత బంధును ప్రజలు నమ్మరని, తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు ఖాయమని బీజేపీ నేత డీకే అరుణ ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ వికారాబాద్ జిల్లా ప్రజలను సీఎం కేసీఆర్ నిండా ముంచారని మండిపడ్డారు. ప్రాజెక్టుల పేరుతో వేల కోట్లు వెనకేసుకొని ఎన్నికల్లో డబ్బులు జల్లుతున్నారని దుయ్యబట్టారు. ప్రజలను కేసీఆర్ కులాల పేరుతో విభజించి పాలన సాగిస్తున్నారని విమర్శించారు. కేంద్ర పథకాలను తెలిపేందుకే బీజేపీ నేత బండిసంజయ్ […]
Written By:
, Updated On : September 3, 2021 / 04:36 PM IST

ఉప ఎన్నికల కోసం తెచ్చిన దళిత బంధును ప్రజలు నమ్మరని, తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు ఖాయమని బీజేపీ నేత డీకే అరుణ ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ వికారాబాద్ జిల్లా ప్రజలను సీఎం కేసీఆర్ నిండా ముంచారని మండిపడ్డారు. ప్రాజెక్టుల పేరుతో వేల కోట్లు వెనకేసుకొని ఎన్నికల్లో డబ్బులు జల్లుతున్నారని దుయ్యబట్టారు. ప్రజలను కేసీఆర్ కులాల పేరుతో విభజించి పాలన సాగిస్తున్నారని విమర్శించారు. కేంద్ర పథకాలను తెలిపేందుకే బీజేపీ నేత బండిసంజయ్ పాదయాత్ర చేస్తున్నారని డీకే అరుణ తెలిపారు.