https://oktelugu.com/

JioPhone Next: కేవలం 500 రూపాయలకే జియో స్మార్ట్ ఫోన్.. నిజమేంటంటే..?

JioPhone Next: దేశంలో స్మార్ట్ ఫోన్ల వినియోగం రోజురోజుకు పెరుగుతుండగా 5000 రూపాయల నుంచి 2 లక్షల రూపాయల వరకు వేర్వేరు ఫీచర్లతో ఎన్నో స్మార్ట్ ఫోన్లు మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి. వినాయకచవితి పండుగ సందర్భంగా జియో గూగుల్ భాగస్వామ్యంతో స్మార్ట్ ఫోన్ జియో ఫోన్ నెక్స్ట్ మార్కెట్ లోకి అందుబాటులోకి రానుంది. ఈ ఫోన్ ప్రపంచంలోనే అత్యంత చౌకైన స్మార్ట్ ఫోన్ కావడం గమనార్హం. ఈ ఫోన్ ఫీచర్లు, ధరకు సంబంధించి ఇప్పటికే కొన్ని […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : September 3, 2021 / 04:12 PM IST
    Follow us on

    JioPhone Next: దేశంలో స్మార్ట్ ఫోన్ల వినియోగం రోజురోజుకు పెరుగుతుండగా 5000 రూపాయల నుంచి 2 లక్షల రూపాయల వరకు వేర్వేరు ఫీచర్లతో ఎన్నో స్మార్ట్ ఫోన్లు మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి. వినాయకచవితి పండుగ సందర్భంగా జియో గూగుల్ భాగస్వామ్యంతో స్మార్ట్ ఫోన్ జియో ఫోన్ నెక్స్ట్ మార్కెట్ లోకి అందుబాటులోకి రానుంది. ఈ ఫోన్ ప్రపంచంలోనే అత్యంత చౌకైన స్మార్ట్ ఫోన్ కావడం గమనార్హం.

    ఈ ఫోన్ ఫీచర్లు, ధరకు సంబంధించి ఇప్పటికే కొన్ని వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. అయితే జియో నుంచి మాత్రం ఇప్పటివరకు ఈ ఫోన్ కు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. తాజాగా జియో ఫోన్ నెక్స్ట్ కు సంబంధించి ఒక వార్త నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. జియో ధర విషయంలో కొత్త వ్యూహాలను అమలు చేయనుందని తెలుస్తోంది. జియో ఫోన్ నెక్స్ట్ రెండు మోడళ్లలో అందుబాటులోకి రానుందని ఒక మోడల్ ధర 5,000 రూపాయలు, మరో మోడల్ ధర 7,000 రూపాయలు అని సమాచారం.

    అయితే కేవలం ఒక మోడల్ కు 500 రూపాయలు, మరో మోడల్ కు 700 రూపాయలు చెల్లిస్తే చాలనే విధంగా జియో స్పెషల్ స్కీమ్ ను రూపొంచిందని తెలుస్తోంది. మిగిలిన మొత్తాన్ని బ్యాంకులు లేదా ఫైనాన్స్ సంస్థలకు వాయిదాల రూపంలో చెల్లించాల్సి ఉంటుందని సమాచారం. అయితే ఆ మొత్తానికి వడ్డీ చెల్లించాలా..? లేక నిర్దేశిత ఇన్ స్టాల్మెంట్లు ఉంటాయా..? అనే ప్రశ్నలకు సమాధానం తెలియాల్సి ఉంది.

    జియో బ్యాంకులు, బ్యాంకింగేతర సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే 500 రూపాయలకే జియో స్మార్ట్ ఫోన్ ను అందించనున్నట్టు అధికారికంగా ప్రకటన అయితే రాలేదు. ఈ నెల 10వ తేదీ వరకు ఎదురుచూస్తే మాత్రమే జియో ఫోన్ నెక్స్ట్ కు సంబంధించి పూర్తి వివరాలు తెలిసే అవకాశాలు ఉంటాయి.