
కృష్ణా జలాలపై ఏపీ దాదాగిరీ చేస్తోందంటూ తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తోసిపుచ్చారు. ఎవరు దాదాగిరి చేశారో అందరికీ తెలుసన్నారు. దాదాగిరీ అంటే విద్యుదుత్పత్తి పేరుతో నీటిని సముద్రానికి వదలడమే కదా అని ఆయన వ్యాఖ్యానించారు. జలవిద్యుత్ పేరుతో 30 టీఎంసీల నీటిని సముద్రం పాలు చేశారని విమర్శించారు. జలశక్తి ఆదేశాలను కూడా పొరుగు రాష్ట్రం పెడచెవిన పెట్టిందని మండిపడ్డారు.