Ram Charan Peddi movie : సోషల్ మీడియా లో ఇప్పుడు ఎక్కడ చూసినా ‘పెద్ది’ మేనియా నే కనిపిస్తుంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరో గా నటించిన ఈ సినిమా పై మొదటి నుండి అభిమానుల్లో , ప్రేక్షకుల్లో అంచనాలు భారీ రేంజ్ లో ఉండేవి. ఆ అంచనాలను రెట్టింపు చేస్తూ మేకర్స్ చేస్తున్న ప్రొమోషన్స్ సినిమా పై మరింత హైప్ ని పెంచేలా చేశాయి. ఇక నేడు విడుదల చేసిన ట్రైలర్ అయితే అభిమానులకు తెగ నచ్చేసింది, ముఖ్యంగా రామ్ చరణ్ వేరియేషన్స్ వేరే లెవెల్ లో ఉన్నాయని ట్రైలర్ ని చూసిన ప్రతీ ఒక్కరు కామెంట్స్ చేస్తున్నారు. ఒక్కమాట లో చెప్పాలంటే పాపం ఈ సినిమా కోసం ఆయన ప్రాణం పెట్టేశాడు అని చెప్పొచ్చు. ఇదంతా పక్కన పెడితే ఈ ట్రైలర్ లో ఎవ్వరూ గమనించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి.
ముఖ్యంగా రామ్ చరణ్ రౌడీ గ్యాంగ్ ని ఎగురుకుంటూ ఉంటాడు, అప్పుడు పక్కనే నేల మీద ఒక మృతదేహం ఉంటుంది , అది ఎవరిదో కాదు జగపతి బాబు ది. ఈ చిత్రం లో ఆయన అప్పలసూరి అనే క్యారెక్టర్ చేశాడు. తన ఊరికి రైలు మార్గం కోసం పోరాడే ముసలాయన క్యారెక్టర్ లో ఇందులో జగపతి బాబు కనిపించబోతున్నాడు. ట్రైలర్ లో ఇంకా బాగా గమనిస్తే , జగపతి బాబు అందరి కాళ్ళను పట్టుకొని బ్రతిమిలాడుతూ ఉంటాడు. ఆయన సన్నివేశాలు మొత్తం వేరే లెవెల్ లో వచ్చినట్టు ఉన్నాయి. అలా ఊరి కోసం పోరాడుతూ ప్రాణాలు వదులుతాడు , అతని పోరాటాన్ని ‘పెద్ది’ కొనసాగిస్తాడు , ఇదే స్టోరీ అనేది ట్రైలర్ ని చూస్తే స్పష్టంగా అర్థం అవుతోంది. జగపతి బాబు, రామ్ చరణ్ మధ్య ఫస్ట్ హాఫ్ లో చూపించే బాండింగ్ వేరే లెవెల్ లో ఉంటుందని, ఆడియన్స్ బాగా ఎమోషనల్ అయిపోతారని డైరెక్టర్ బుచ్చి బాబు కూడా ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు.
ఇక ట్రైలర్ చివర్లో ‘పెద్ది ఈజ్ బ్యాక్ ఆన్ ఫీట్’ అనే కామెంటరీ వినిపిస్తుంది గమనించారా?, ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఒకటి ఉంది , బ్యాక్ ఆన్ ది ఫీట్ అంటే, పెద్ది మరోసారి తన కాళ్ళ పై నిలబడ్డాడు అని, అంటే ఇన్ని రోజులు సోషల్ మీడియా లో జరిగిన ప్రచారానికి తగ్గట్టుగానే , ఇందులో రామ్ చరణ్ తన కాళ్ళను కోల్పోతాడు అని అర్థం అవుతోంది. ఇలాంటి సీక్వెన్స్ లు సినిమాలో చాలానే ఉంటాయట, చివరి 45 నిమిషాలు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హిస్టరీ లోనే ఇప్పటి వరకు ఎవ్వరూ చూడని విధంగా ఉండబోతుందని టాక్.
