Mahesh Kumar Goud Vs Ponguleti: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై టీపీసీసీ చీప్ మహేశ్ కుమార్ గౌడ్ ఫైర్ అయ్యారు. రిజర్వేషన్ల అంశంతో ముడిపడి ఉన్న స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రకటన చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. క్యాబినెట్ లో చర్చించాల్సిన అంశాలను ముందుగానే మీడియాతో మాట్లాడితే ఎలా అని అసహనం వ్యక్తం చేశారు. ఒకరి మంత్రిత్వ శాక అంశంపై వేరొకరు మాట్లాడం సరికాదన్నారు. కోర్టు పరిధిలో ఉన్న అంశాలపై మాట్లాడేటప్పుడు అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని జాగ్రత్తగా ఉండాలని సూచించారు.