Vangaveeti Radhakrishna: వంగవీటి రాధాకు షాక్ ఇచ్చిన పవన్ కళ్యాణ్

అవనిగడ్డ నియోజకవర్గం నుంచి ఇంతవరకు జనసేన అభ్యర్థి పేరును ప్రకటించలేదు. దీంతో ఇక్కడ నుంచి వంగవీటి రాధాకృష్ణ పోటీ చేస్తారని కొత్తగా ప్రచారం ప్రారంభమైంది. మొన్న ఆ మధ్యన ఆయన జనసేన కీలక నేత నాదేండ్ల మనోహర్ ను కలవడం, అటు తరువాత నేరుగా వెళ్లి వల్లభనేని బాలశౌరితో చర్చలు జరపడంతో అంతా నిజమేనని భావించారు.

Written By: Dharma, Updated On : March 26, 2024 3:19 pm

Vangaveeti Radhakrishna

Follow us on

Vangaveeti Radhakrishna: అవనిగడ్డ అసెంబ్లీ స్థానం నుంచి వంగవీటి రాధా పోటీ చేస్తారా? మచిలీపట్నం ఎంపీ స్థానం నుంచి నాగబాబు పోటీ చేస్తారా? అప్పుడు వల్లభనేని బాలశౌరి పరిస్థితి ఏంటి? ఇవి ఊహాగానాలేనా? నిజంగా అటువంటి పరిణామాలు జరుగుతున్నాయా? ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. పొత్తులో భాగంగా జనసేనకు 21 అసెంబ్లీ, రెండు పార్లమెంట్ స్థానాలు దక్కాయి. అందులో మచిలీపట్నం పార్లమెంట్ స్థానం ఒకటి. అయితే ఇక్కడి నుంచి సిట్టింగ్ ఎంపీ వల్లభనేని బాలశౌరి పోటీ చేస్తారని బలమైన ప్రచారం జరిగింది.అయితే ఇప్పుడు ఆయన స్థానంలో నాగబాబు పేరు వినిపిస్తోంది.

అవనిగడ్డ నియోజకవర్గం నుంచి ఇంతవరకు జనసేన అభ్యర్థి పేరును ప్రకటించలేదు. దీంతో ఇక్కడ నుంచి వంగవీటి రాధాకృష్ణ పోటీ చేస్తారని కొత్తగా ప్రచారం ప్రారంభమైంది. మొన్న ఆ మధ్యన ఆయన జనసేన కీలక నేత నాదేండ్ల మనోహర్ ను కలవడం, అటు తరువాత నేరుగా వెళ్లి వల్లభనేని బాలశౌరితో చర్చలు జరపడంతో అంతా నిజమేనని భావించారు. ఒకటి రెండు రోజుల్లో రాధాకృష్ణ జనసేనలో చేరతారని కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.ఒకవేళ రాధా ముందుకొస్తే మచిలీపట్నం ఎంపీ సీటును బాలశౌరి వదులుకుంటారని.. అవనిగడ్డ నుంచి బాలశౌరి పోటీ చేస్తారని కూడా టాక్ నడిచింది. అయితే ఇంతలో కొత్తగా నాగబాబు పేరు తెరపైకి వచ్చింది. ఆయన సైతం మచిలీపట్నం ఎంపీ స్థానం నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తారనిప్రచారం ప్రారంభమైంది.దీంతో జనసేన శ్రేణులు ఒకరకమైన ఆందోళనతో ఉన్నారు.

జనసేన 18 మంది అభ్యర్థులను ఖరారు చేసింది. పాలకొండ, విశాఖ సౌత్, అవనిగడ్డ నియోజకవర్గం పెండింగ్ లో పెట్టింది. అక్కడ వీలైనంత త్వరగా అభ్యర్థులను ప్రకటించేందుకు కసరత్తు చేస్తోంది. అందులో భాగంగా ఐవిఆర్ఎస్ సర్వే చేస్తోంది. పవన్ కళ్యాణ్ వాయిస్ తో కూడిన ఫోన్ కాల్స్ ఆ నియోజకవర్గాల ప్రజలకు వస్తున్నాయి. అవనిగడ్డకు సంబంధించి మూడు పేర్లను ఈ సర్వేలో బయట పెట్టడం విశేషం. వికృతి శ్రీనివాస్, బండి రామకృష్ణ,బండి రెడ్డి రామకృష్ణ పేర్లను మాత్రమే జనసేన తన సర్వేలో చెబుతుండడం విశేషం. దీంతో అవనిగడ్డ నియోజకవర్గం విషయంలో ఫుల్ క్లారిటీ వచ్చింది. అక్కడ కానీ.. వల్లభనేని బాలశౌరి కానీ పోటీ చేసే ఛాన్స్ లేదని తేలిపోయింది. అటు నాగబాబు ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగుతారన్న ప్రచారం సైతం ఫేక్ అని నిర్ధారణకు వచ్చింది.