
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొద్ది రోజుల క్రితం కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఆయన కొద్ది రోజులుగా తన ఫాం హౌజ్ లో ఉండి చికిత్స తీసుకుంటున్నారు. ఆయన కోలుకున్న విషయాన్ని జనసేన పార్టీ అధికారికంగా ప్రకటించింది. కరోనా బారినా పడిన పవన్ కళ్యాణ్ కి వైద్య సేవలు అందించిన డాక్టర్స్ మూడు రోజుల కిందట ఆర్ టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించారు. ఆ పరీక్షలలో నెగిటివ్ వచ్చింది. కరోనా అనంతరం వచ్చే నిస్త్రాణం వంటివి మాత్రం ఉన్నాయని, ఆరోగ్యపరంగా పవన్ కళ్యాణ్ కి ఇబ్బందులు లేవని వైద్యులు తెలిపినట్టు జనసేన ప్రకటించింది.