pakistan vs india : ఈ ఏడాది దక్షిణాఫ్రికా జట్టుతో జరిగిన టి20 సిరీస్ లో తిలక్ వర్మ దుమ్మురేపాడు. ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. అత్యంత స్వేచ్ఛగా పరుగుల వరద పారించాడు. తద్వారా తాను ఎంత ప్రమాదకరమైన ఆటగాడినో దక్షిణాఫ్రికా ప్లేయర్లకు రుచి చూపించాడు. వాస్తవానికి ఆ సిరీస్ జరిగింది దక్షిణాఫ్రికాలో.. కానీ ఇండియాలో జరిగినట్టుగా బ్యాటింగ్ చేశాడు తిలక్ వర్మ.
कल अकेले अपने दम पर #AsiaCup2025 का final जितवाने वाले #tilakvarma को कुछ लोग बहुजन बता रहे हैं।
हमने मालूमात की तो पता चला कि तिलक वर्मा का पूरा नाम नम्बूरी ठाकुर तिलक वर्मा है, जो कि एक तेलगु ब्राह्मण परिवार से आते हैं। लड़का यूरेशियन शेर है इसलिए कोई अपना दावा न ठोके।
जय… https://t.co/c4c0KuJfGV pic.twitter.com/UfCgZtAq77
— आशुतोष (@bakaitbaaz) September 29, 2025
అయితే నాడు అతడు ఆడిన ఆట అడ్డిమారి గుడి దెబ్బ అని కొంతమంది ఆరోపించారు. కానీ వారి ఆరోపణలకు సరైన సమాధానం చెప్పాడు తిలక్ వర్మ. తనది వైల్డ్ కార్డు ఎంట్రీ కాదని.. తన ఆటలోనే వైల్డ్ గా ఉందని నిరూపించాడు తిలక్. ముఖ్యంగా పాకిస్తాన్ జట్టితో జరిగిన ఫైనల్ మ్యాచ్లో తనకు మాత్రమే సాధ్యమైన దూకుడు అయిన ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. 53 బంతుల్లో 63 పరుగులు చేసి.. అది కూడా అజేయంగా నిలిచి.. పాకిస్తాన్ జట్టుకు ఆసియా కప్ విజయాన్ని దూరం చేశాడు. తద్వారా టీమిండియా కు మరోసారి ఆసియా కప్ అందించాడు. కీలకమైన భాగస్వామ్యాలు నెలకొల్పి.. పాకిస్తాన్ ప్లేయర్లకు ఏమాత్రం అవకాశం లేకుండా చేశాడు తిలక్. ఖచ్చితమైన టెక్నిక్ తో.. అద్భుతమైన ఫుట్ వర్క్ తో టీమిండియా కు గెలుపుని మాత్రమే కాదు.. తన అద్భుతమైన కెరియర్ కు బాటలు వేసుకున్నాడు.
విజయం సాధించిన తర్వాత తిలక్ వర్మ రెచ్చిపోయాడు. సాధించాం అన్నట్టుగా అదరగొట్టాడు. ముఖ్యంగా రెండు చేతులతో 6-0 అన్నట్టుగా సంకేతాలు ఇచ్చాడు. ఇటీవల పాకిస్తాన్ బౌలర్ రౌఫ్ భారత జట్టుతో సూపర్ 4 మ్యాచ్ జరిగినప్పుడు రఫెల్ కూల్చేశామని 6-0 అన్నట్టుగా చేతులతో సంకేతాలు ఇచ్చాడు. కానీ దానికి తగ్గ బదులు ఇవ్వడానికి భారత ప్లేయర్లు ఎదురుచూస్తున్నారు. అయితే ఆ అవకాశం తిలక్ వర్మకు వచ్చింది. మ్యాచ్ గెలవడమే ఆలస్యం.. వేగంగా దూసుకు వచ్చి తన రెండు చేతులతో “రఫెల్ ఎప్పటికి నిలబడి ఉంటుంది.. అదే టీమిండి అని గెలిపించింది” అన్నట్టుగా సంకేతాలు ఇచ్చాడు తిలక్ వర్మ.