spot_img
Homeక్రీడలుPakistan cricket team : పాకిస్థాన్ ఆటగాళ్లను ఓ ఆట ఆడుకున్న బంగ్లాదేశ్ ఆటగాళ్లు.. వైరల్...

Pakistan cricket team : పాకిస్థాన్ ఆటగాళ్లను ఓ ఆట ఆడుకున్న బంగ్లాదేశ్ ఆటగాళ్లు.. వైరల్ వీడియో

Pakistan cricket team : పాకిస్తాన్ దేశానికి మాత్రమే కాదు.. అక్కడి జాతీయ క్రికెట్ జట్టుకు కూడా పరిస్థితులు ఏమాత్రం బాగోలేవు. ఇటీవల కాలంలో పాకిస్తాన్, బంగ్లాదేశ్ జోగి జోగి రాసుకుని తిరుగుతున్నాయి. బూడిద రాలుతుందా.. ఇంకేం జరుగుతుందో తెలియదు గానీ.. ప్రస్తుతానికి అయితే ఆ రెండు దేశాలు ఇప్పుడు సయామీ కవలల మాదిరిగా ప్రవర్తిస్తున్నాయి. ఇటీవల పాకిస్తాన్ బంగ్లాదేశ్ కు మిస్సైల్స్.. యుద్ధ సామాగ్రి అమ్మేంది. పాకిస్తాన్ దేశంలో బంగ్లాదేశ్ ఆర్మీకి శిక్షణ కూడా ఇచ్చింది.
బంగ్లాదేశ్లో పాకిస్తాన్ ఇటీవల రెండు టెస్టుల సిరీస్ ఆడింది. రెండు మ్యాచ్ల్లో కూడా ఓడిపోయి వైట్ వాష్ కు గురైంది.. అంతకుముందు పాకిస్తాన్ దేశంలో బంగ్లాదేశ్ రెండు టెస్టులు ఆడింది. అప్పుడు కూడా పాకిస్తాన్ వైట్ వాష్ కు గురైంది.. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ఆటగాళ్ల మీద తీవ్రస్థాయిలో విమర్శలు వినిపిస్తున్నాయి. గొప్ప గొప్ప ప్లేయర్లు ఉన్నప్పటికీ వైట్ వాష్ కు గురికావడం సిగ్గుమాలిన చర్య అంటూ పాకిస్తాన్ అభిమానులు సోషల్ మీడియాలో తమ జట్టు ప్లేయర్లను ఏకి పడేస్తున్నారు. సాల్ట్, కారం వేసుకుని బంగ్లాదేశ్ ప్లేయర్ల సంకనాకమని సూచనలు చేస్తున్నారు.
పాకిస్తాన్, బంగ్లాదేశ్ మధ్య రెండో టెస్టు జరుగుతున్నప్పుడు మైదానంలో ఒక ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. అది కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా సర్కులేట్ అవుతోంది. పాకిస్తాన్ ఇన్నింగ్స్ సమయంలో రిజ్వాన్ బ్యాటింగ్ చేస్తున్నాడు. అయితే అతడి కంటికి ఎదురుగా ఏదో ప్రకాశవంతమైన వస్తువు కనిపిస్తోంది. దీంతో అతడు బ్యాటింగ్ మీద దృష్టి కేంద్రీకరించలేకపోతున్నాడు. ఇదే విషయాన్ని అంపైర్ తో చెప్పాడు. మధ్యలో బంగ్లాదేశ్ ప్లేయర్లు కలగజేసుకున్నారు. అతడు ఎంతసేపటికి తన బాధను చెబుతున్నప్పటికీ.. అంపైర్ పట్టించుకోలేదు. బంగ్లాదేశ్ ప్లేయర్లు వినిపించుకోలేదు. అనేకసార్లు చెప్పినప్పటికీ ఉపయోగం లేకపోవడంతో రిజ్వాన్ సైలెంట్ అయిపోయాడు..
ఈ వీడియో చూసిన టీమిండియా అభిమానులు రిజ్వాన్ మీద వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. చివరికి బంగ్లాదేశ్ కూడా పాకిస్తాన్ క్రికెట్ జట్టు ప్లేయర్లకు గౌరవం ఇవ్వడం లేదని.. ఇంతకంటే దారుణం మరొకటి ఉండదని వారు వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటికైనా పాకిస్తాన్ క్రికెట్ జట్టు తమ స్థాయి తెలుసుకొని వ్యవహరించాలని.. విలువ లేనిచోట ఉండకూడదని.. ఎందుకైనా మంచిది స్వదేశంలోనే ఇతర జట్లతో సిరీస్ లు ఆడాలని టీమిండియా అభిమానులు సూచిస్తున్నారు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Varanasi Movie

Varanasi Movie: వారణాసి అన్ని వేల కోట్లు కలెక్ట్ చేస్తుందా…

Varanasi Movie: రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న 'వారణాసి' సినిమా మీద ప్రేక్షకుల్లో విశేషమైన అంచనాలు ఉన్నాయి. ప్రపంచ స్థాయిలో ఈ సినిమా ఒక పెను సంచలనాన్ని క్రియేట్ చేయబోతుందనే...
Tammineni Family

Tammineni Family: ఒడిస్సాలో చిక్కిన తమ్మినేని ఫ్యామిలీ?!

Tammineni Family: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం కుటుంబంతో సహా పరారీలో ఉన్నారు. తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో నాలుగు కోట్ల భూమిని అక్రమంగా కొల్లగొట్టారు అని...
YSRCP

YSRCP: వైసీపీకి ఆ జిల్లాలో భారీ డ్యామేజ్!

YSRCP: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చిక్కుల్లో పడింది. ఆ పార్టీ నేతలపై వరుసగా కేసులు నమోదవుతున్నాయి. అరెస్టుల పర్వం నడుస్తోంది. ఇప్పటివరకు పాత కేసుల్లో నేతలు అరెస్ట్ అవుతూ వచ్చారు. కానీ ఇప్పుడు...
Operation Prahaar

Operation Prahaar: ఆపరేషన్ ‘ప్రహార్’.. ఉగ్రవాద అంతంపై మోడీ-షా ల అద్భుత వ్యూహమిదీ

Operation Prahaar: భారతదేశంలో ఉగ్రవాదం ఎప్పుడూ కొత్త సవాలు కాదు. కశ్మీర్‌లో దశాబ్దాలుగా సరిహద్దు ఆవలి నుంచి ప్రోత్సాహం పొందుతున్న ఉగ్రవాదం, పంజాబ్‌లో ఖలిస్తానీ కార్యకలాపాలు, దండకారణ్యంలో నక్సలిజం ఇవన్నీ దేశ భద్రతకు...
Oktelugu Epaper