
పాకిస్థాన్ క్రికెట్ టీమ్ కెప్టెన్ బాబర్ అజం ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు గెలుచుకున్నాడు. అటు మహిళల క్రికెట్ లో ఆస్ట్రేలియా టీమ్ వికెట్ కీపర్ అలీసా హీలీని ఈ అవార్డుకు ఎంపిక చేశారు. ఏప్రిల్ అద్భుతమైన ప్రదర్శన చేసినందుకుగాను ఈ ఇద్దరికీ అవార్డులు దక్కాయి. సౌతాఫ్రికాతో జరిగిన సిరీస్ లో అన్ని ఫార్మాట్ లలో నిలకడగా రాణించిన అజంకు అభిమానులు పెద్ద ఎత్తున ఓట్లు వేసి గెలిపించారు. 13 పాయింట్లు సాధించి మొత్తం 865 పాయింట్లతో కెరీర్ బెస్ట్ సాధించాడు.