US Warplane in Pakistan Air Base : జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో పర్యాటకులపై ఇటీవల పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు దాడిచేశారు. దీనికి ప్రతిచర్యగా భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. దీంతో పాకిస్తాన్‌తోపాటు, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని 9 ఉగ్రస్థావరాలు ద్వంసమయ్యాయి. దీంతో పాకిస్తాన్ కూడా ప్రతిదాడుల చేయగా, భారత వాయుసేన.. పాకిస్తాన్ దాడులను తిప్పి కొట్టడంతోపాటు ఆ దేశలోని 11 ఎయిర్‌బేస్‌లను ధ్వంసం చేసింది. ఇందులో పాకిస్తాన్ అణ్వాయుధాల తయారీ కేంద్రం కిరాణా హిల్స్‌తోపాటు నూర్‌ఖాన్ ఎయిర్ బేస్ కూడా ఉంది. ఈ ఎయిర్‌బేస్ పాకిస్తాన్‌కు అత్యంత కీలకమైనది. పాకిస్తాన్ తయారు చేసే అణ్వాయుధాలను ఇక్కడి నుంచే ప్రయోగిచే అవకాశం ఉంది. ఆపరేషన్ సిందూర్‌తో ఈ ఎయిర్ బేస్ తీవ్రంగా దెబ్బతినడంతో పాకిస్తాన్ మరమ్మతులు చేపట్టింది. అయితే ఈ సమయంలో అమెరికా యుద్ధ విమానం సీ 17 సడెన్‌కా నూర్‌ఖాన్ ఎయిర్ బేస్‌కు వచ్చింది.
కీలక వైమానిక స్థావరం..
నూర్‌ఖాన్ ఎయిర్ బేస్, పాకిస్తాన్‌లోని రావల్పిండిలో ఉన్న ఒక కీలకమైన వైమానిక స్థావరం, ఇటీవల భారత దాడులతో గణనీయమైన నష్టాన్ని చవిచూసింది. పాకిస్తాన్ వైమానిక దళం ముఖ్యమైన ఆపరేషనల్ కేంద్రంగా పనిచేస్తుంది. తాజాగా ఈ ఎయిర్ బేస్‌లో అమెరికాకు చెందిన యుద్ధ విమానం లాంచ్ అయినట్లు సమాచారం. ఈ సంఘటన భారత్–పాకిస్తాన్ ఘర్షణల నేపథ్యంలో అమెరికా పాత్రపై కొత్త ప్రశ్నలను లేవనెత్తింది. ఈ యుద్ధ విమానం రాకతో, నూర్‌ఖాన్ స్థావరంలో అమెరికాకు చెందిన అణ్వాయుధాలు ఉన్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అమెరికా గతంలో ఆఫ్ఘనిస్తాన్ ఆపరేషన్ల సమయంలో పాకిస్తాన్‌లోని సైనిక స్థావరాలను ఉపయోగించిన చరిత్ర ఉంది, ఇది ఈ అనుమానాలకు బలాన్ని చేకూర్చుతుంది.
అణ్వాయుధాల అనుమానాలు..
నూర్‌ఖాన్ ఎయిర్ బేస్ నుంచి పాకిస్తాన్ తన అణ్వాయుధాలను కూడా ప్రయోగించే ఏర్పాట్లు చేసుకున్నట్లు సమాచారం ఉంది. ఈ స్థావరం పాకిస్తాన్ అణు ఆయుధ కార్యక్రమంలో కీలకమైన పాత్ర పోషిస్తుందని భావిస్తున్నారు. 1998లో అణు పరీక్షల తర్వాత, పాకిస్తాన్ తన అణు సామర్థ్యాన్ని బలోపేతం చేసుకుంది. నూర్ఖాన్ వంటి స్థావరాలు దీనికి కేంద్రంగా ఉన్నాయని నిఘా నివేదికలు సూచిస్తున్నాయి. అమెరికా యుద్ధ విమానం ఈ స్థావరంలో ఉండటం ద్వారా, అమెరికా–పాకిస్తాన్ మధ్య రక్షణ సహకారం లేదా అమెరికా అణు ఆయుధాల ఉనికి గురించి ఊహాగానాలు తలెత్తుతున్నాయి. ఇది భారత్‌తోపాటు చైనా, ఇరాన్ వంటి ఇతర దేశాలను కూడా ఆందోళనకు గురిచేస్తుంది. ఎందుకంటే ఇది దక్షిణాసియాలో శక్తి సమతుల్యతను మార్చగలదు.
భారత్ ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తోంది. నూర్‌ఖాన్ ఎయిర్ బేస్‌పై దాడి చేసిన భారత్, పాకిస్తాన్ సైనిక సామర్థ్యాలను దెబ్బతీయడంతోపాటు, అమెరికా జోక్యం గురించి కూడా ఆందోళన వ్యక్తం చేస్తోంది. భారత్ యొక్క బాలిస్టిక్ క్షిపణి రక్షణ వ్యవస్థ, ముఖ్యంగా ఎస్–400 వంటి అధునాతన వ్యవస్థలు, పాకిస్తాన్ నుంచి ఎదురయ్యే ఏ రకమైన గగనతల దాడులనైనా అడ్డుకునే సామర్థ్యం కలిగి ఉన్నాయి. అయితే, అమెరికా యుద్ధ విమానాల ఉనికి ఈ రక్షణ వ్యవస్థలకు కొత్త సవాళ్లను తీసుకొస్తుంది. భారత్ ఈ సందర్భంలో తన దౌత్యపరమైన, సైనిక వ్యూహాలను బలోపేతం చేయాల్సి ఉంటుంది.