
గత శతాబ్ద కాలంలో ప్రపంచం ఎదుర్కొన్న అతి పెద్ద మహమ్మారి కరోనానే అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ప్రతి నెల చివరి ఆదివారం నిర్వహించే మన్ కీ బాత్ లో ఆయన మాట్లాడారు. ఆక్సిజన్ కొరతను అధిగమించేందుకు దేశవ్యాప్తంగా అనేక చర్యలు చేపట్టినట్లు మోదీ తెలిపారు. విదేశాల నుంచి క్రయోజనిక్ ట్యాంకర్లు, కాన్సంట్రేటర్లు దిగుమతి చేసుకోవడంతో పాటు దేశీయంగా కొత్త ఆక్సిజన్ ప్లాంట్ల నిర్మాణం జరిగిందన్నారు. ఈ క్రమంలో రోజుకు 900 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి సామర్థ్యాన్ని నేడు 9500 మెట్రిక్ టన్నులకు పెంచామని తెలిపారు. దాదాపు 10 రెట్లు ఉత్పత్తి పెరిగిందన్నారు.