https://oktelugu.com/

ఆక్సిజన్ అందక 11 మంది కరోనా రోగుల మృతి

దేశంలో కరోనా మహమ్మారి విళయతాండవం చేస్తున్న వేళ.. ఆక్సిజన్ కొరత కరోనా రోగులను పొట్టనపెట్టుకుంటున్నది. ప్రతిరోజు ఏదో ఒకచోట ఆక్సిజన్ కొరతతో మరణాలు సంభవిస్తున్న ఘటనలు చూస్తూనే ఉన్నాం. తాజాగా తమిళనాడులోని చెంగల్ పట్టులో విషాదం చోటుచేసుకుంది. చెంగల్ పట్టులోని ప్రభుత్వ దవాఖానలో ఆక్సినజన్ అందకపోవడంతో 11 మంది కరోనా రోగులు మరణించారు. దీంతో దవాఖానలో చికిత్స పొందుతూ ఆక్సిజన్ అవసరం ఉన్న రోగులను అధికారులు ఇతర హాస్పటళ్లకు తరలించారు. చికిత్స పొందుతున్న బాధితులకు ఆక్సిజన్ సరఫరాలో […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : May 5, 2021 / 07:57 AM IST
    Follow us on

    దేశంలో కరోనా మహమ్మారి విళయతాండవం చేస్తున్న వేళ.. ఆక్సిజన్ కొరత కరోనా రోగులను పొట్టనపెట్టుకుంటున్నది. ప్రతిరోజు ఏదో ఒకచోట ఆక్సిజన్ కొరతతో మరణాలు సంభవిస్తున్న ఘటనలు చూస్తూనే ఉన్నాం. తాజాగా తమిళనాడులోని చెంగల్ పట్టులో విషాదం చోటుచేసుకుంది. చెంగల్ పట్టులోని ప్రభుత్వ దవాఖానలో ఆక్సినజన్ అందకపోవడంతో 11 మంది కరోనా రోగులు మరణించారు. దీంతో దవాఖానలో చికిత్స పొందుతూ ఆక్సిజన్ అవసరం ఉన్న రోగులను అధికారులు ఇతర హాస్పటళ్లకు తరలించారు. చికిత్స పొందుతున్న బాధితులకు ఆక్సిజన్ సరఫరాలో ఎక్కడ లోపం తలెత్తిందనే విషయం తెలియాల్సి ఉంది.