
ఆంధ్రప్రదేశ్ లో నేటి నుంచి మధ్యాహ్నం కర్ప్యూ అమల్లోకి రానుంది. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకే షాపులకు అనుమతిచ్చారు. కరోనా నివారణ చర్యల్లో భాగంగా మధ్యాహ్నం 12 తరువాత ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను విధించింది. ఇప్పటికే సాయంత్రం కర్ప్యూ అమలు చేస్తుండగా, నేటి నుంచి పగటి పూట కర్ఫ్యూ కూడా అమలవుతుంది. ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. దీంతో రాష్ట్రంలో ప్రతిరోజు 18 గంటల చొప్పున కర్ఫ్యూ అమలు కానుంది.