
రాష్ట్రంలోని ఆస్పత్రుల్లో ఆక్సిజన్ ఆడిట్ ను ఏపీ ప్రభుత్వం ప్రారంభించింది. ఆస్పత్రుల వారీగా సరఫరా అయ్యే ఆక్సిజన్ లెక్కలు తీయాలని నిర్ణయించింది. రోజువారీ వినియోగం ఆక్సిజన్ పడకలపై ప్రభుత్వం ఆరా తీస్తోంది. ఒక్కో ఆస్పత్రిలో ఎన్ని ట్యాంటకుల ఆక్సిజన్ వాడారనే దానిపై ఆడిటింగ్ కు ఆదేశించింది. రోజువారీ అవసరాలకు 330 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ కావాలని ప్రస్తుతం దాదాపు 290 మెట్రిక్ టన్నులే ఉందని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.