
దేశంలో రెండు కంపెనీలే కోవిడ్ వ్యాక్సిన్ తయారు చేస్తున్నాయని, నెలకు 6నుంచి 7 కోట్ల వ్యాక్సిన్లు మాత్రమే ఆ కంపెనీలు ఉత్పత్తి చేస్తున్నాయని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఇదే తరహాలో అయితే ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ ఇవ్వడానికి రెండేళ్లు పడుతుందని చెప్పారు. అప్పటికీ చాలా వేవ్ లు వస్తాయని పేర్కొన్నారు. వ్యాక్సిన్ తయారీని యుద్ధ ప్రాతిపదికన చేపట్టాల్సిన అవసరం ఉందని అందరికీ వ్యాక్సిన్ ఇచ్చేందుకు నేషనల్ ప్లాన్ రూపొందించాలని కేంద్రానికి సూచించారు.