
దేశంలో జూలై చివరి నాటికి రోజు కోటి డోసులు వ్యాక్సిన్లు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం భావిస్తోందని ఎయిమ్స్ చీఫ్ డాక్టర్ రణదీప్ గులేరియా పేర్కొన్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియలో భారత్ నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకోవాలంటే దేశంలో టీకాల ఉత్పత్తిని పెంచాలన్నారు. అలాగే వ్యూహాత్మకంగా విదేశాల నుంచి వీలైనన్ని వ్యాక్సిన్లు తెప్పించుకోవాలన్నారు. వ్యాక్సిన్ సేకరణకు ఖచ్చితమైన వ్యూహంతో ముందుకెళ్లాలని సూచించారు. పలువురితో కాకుండా ఒక్కరితోనే చర్చలు జరిపేందుకు తయారీదారులు ప్రాధాన్యత ఇస్తరాని తెలిపారు.