
దేశంలో రెండో రోజుల విరామం అనంతరం పెట్రోల్ రేట్లు శుక్రవారం మరోసారి పైకి కదిలాయి. అయితే, డీజిల్ రేట్లను మాత్రం చమురు కంపెనీలు పెంచలేదు. ఇప్పటికే దేశంలో రికార్డు స్థాయికి పెట్రోల్ ధరలు చేరగా తాజాగా 35 పైసలు పెరిగింది. పెంచిన ధరతో దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ రేటు రూ. 100కు చేరువైంది. ప్రస్తుతం రూ. 99.16 ధర పలుకుతోంది. డీజిల్ రూ. 89.15కు పెరిగింది. ఆర్థిక రాజధాని ముంబై మహానగరంలో లీటర్ రూ. 105.24 డీజిల్ రూ. 96.72కు చేరింది. దేశంలోని 12 రాష్ట్రలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో పెట్రోల్ రూ. 100 మార్క్ ను దాటింది. హైదదాబాద్ లో పెట్రోల్ రూ. 103.05.. డీజిల్ రూ. 97.20 గా ఉంది.