
సిద్ధిపేట జిల్లా మల్లన్న సాగర్ ముంపు గ్రామం వేములఘాట్ లో విషాదం చోటుచేసుకుంది. కూలగొట్టిన తన ఇంటి ఆవరణలోనే చితి పేర్చుకుని మల్లారెడ్డి అనే వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు చితిలో మిగిలిన శరీర భాగాలను పోస్టుమార్టానికి పంపించారు. వృద్ధుని ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు.