మమతను దెబ్బ తీయడానికే బీజేపీ వ్యూహం

రాజకీయ వ్యూహాలు అమలు చేయడంలో ప్రధాని మోడీ,హోం మంత్రి అమిత్ షా తరువాతే ఎవరైనా. ప్రత్యర్థిని మట్టి కరిపించే సత్తా వారిలో ప్రస్పుటంగా ఉంటుంది. అందుకే దేశంలో రెండో సారి అధికారం చేపట్టగలిగారు. కాంగ్రెస్ లాంటి మహా పార్టీని నామరూపాలు లేకుండా చేశారు. ప్రస్తుతం వారు బెంగాల్ పై దృష్టి సారించారు. ఎలాగైనా మమతా బెనర్జీని అధికార పీఠంపై దింపేందుకు పావులు కదుపుతున్నారు. వారి పాచికలో భాగంగా ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిని సైతం మార్చేందుకు పథకం వేశారు. అనుకున్నదే […]

Written By: Raghava Rao Gara, Updated On : July 4, 2021 6:59 pm
Follow us on

రాజకీయ వ్యూహాలు అమలు చేయడంలో ప్రధాని మోడీ,హోం మంత్రి అమిత్ షా తరువాతే ఎవరైనా. ప్రత్యర్థిని మట్టి కరిపించే సత్తా వారిలో ప్రస్పుటంగా ఉంటుంది. అందుకే దేశంలో రెండో సారి అధికారం చేపట్టగలిగారు. కాంగ్రెస్ లాంటి మహా పార్టీని నామరూపాలు లేకుండా చేశారు. ప్రస్తుతం వారు బెంగాల్ పై దృష్టి సారించారు. ఎలాగైనా మమతా బెనర్జీని అధికార పీఠంపై దింపేందుకు పావులు కదుపుతున్నారు. వారి పాచికలో భాగంగా ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిని సైతం మార్చేందుకు పథకం వేశారు. అనుకున్నదే తడవుగా ఉత్తరాఖండ్కు నాలుగు నెలల్లో ముగ్గురు ముఖ్యమంత్రులను మార్చిన ఘనత వారిదే.

ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి తీరత్ సింగ్ రావత్ మార్చి 10న సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. అయితే అప్పటికే ఆయన లోక్ సభ లో ఎంపీగా ఉన్నారు. దీంతో సీఎం గా కొనసాగాలంటే అసెంబ్లీలో సభ్యుడిగా ఉండాల్సిన అవసరం ఏర్పడింది. అక్కడ శాసనమండలి లేదు. దీంతో ఆయనకు శాసనసభ్యత్వమే శరణ్యం కానుంది. కొవిడ్ కారణంగా ఎన్నికలు నిర్వహించలేమని చెప్పి ఆయనను పదవి నుంచి తప్పించారు.

పశ్చిమ బెంగాల్లో కూడా మమతా బెనర్జీ అదే పరిస్థితి. ఆమె సీఎం గా కొనసాగాలంటే ఆరునెలల్లోగా అసెంబ్లీలో అడుగు పెట్టాలి. ఆమెను బలి పశువును చేసేందుకే తీరత్ సింగ్ రావత్ ను ఎరగా వేశారని ప్రచారం సాగుతోంది. ముందస్తు ప్రణాళిక ప్రకారమే తీరత్ సింగ్ రావత్ ను సీఎం కుర్చీ నుంచి తప్పించేందుకు మోడీ షా ఆలోచన చేసినట్లు పలువురు ఆరోపిస్తున్నారు. తీరత్ సింగ్ రావత్ ను తెరమీదకు తీసుకొచ్చి మమతను గద్దె దింపేందుకు బీజేపీ వ్యూహం సిద్ధం చేసిందని విశ్లేషకులు చెబుతున్నారు.

బీజేపీ చట్టపరంగా అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినయోగం చేసుకుంటోంది. ఇప్పటికే మమత పోటీ చేయబోయే సీటుపై నందిగ్రామ్ తరహా వ్యూహాలను అమలు చేసేందుకు పావులు కదుపుతోంది. మమతను డైలమాలో పడేసేందుకే బీజీపీ సర్వ శక్తులూ ఒడ్డుతోందని తెలుస్తోంది. మమతకు చెక్ పెట్టాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. దీంతో మమత ఎపిసోడ్ లో బీజేపీ ఇంకా ఏ రకంగా ముందుకు వెళుతుందో8 వేచి చూడాల్సిందే.