
సిరిసిల్ల పర్యటనలో అధికారుల తీరుతో సీఎం కేసీఆర్ తీవ్ర అసహనానికి గురయ్యారు. కత్తెరతో చేయాల్సిన రిబ్బన్ కటింగ్ ను చేత్తో కానిచ్చేశారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల శంకుస్థాపన, గృహప్రవేశాల కార్యక్రమంలో పాల్గొన్న కేసీఆర్ ఓ ఇంటి గృహ ప్రవేశానికి రెడీ అయ్యారు. అయితే రిబ్బన్ కట్ చేద్దామనుకునే సరికి కత్తెర లేదు. అందరూ కత్తెర కత్తెర అంటూ అటూ ఇటూ చూడ్డం మొదటు పెట్టారు. దీంతో కేసీఆర్ ఆగ్రహానికి గురయ్యారు. వెంటనే తనే చేత్తో రిబ్బన్ ను పీకి పడేశారు. అనంతరం దంపతులతో కలిసి కొత్త ఇంట్లోకి అడుగుపెట్టారు.