
కరోనా విజ్రంభణ వల్ల దేశంలో ఎంతోమంది ప్రముఖులు చనిపోతున్నారు. తాజాగా ఒడిస్సా లోని బీజూ జనతా దళ్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ప్రదీప్ కరోనా కారణంగా తుది శ్వాశ విడిచారు. ఈయన రాష్ట్రంలోని పిపిలి నియోజకవర్గం నుంచి ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందాడు. కరోనా రావడంతో ఆసుపత్రిలో చేరి వైద్య చికిత్స తీసుకోవడంతో కరోనా నుంచి కోలుకోగా డిశ్చార్జ్ అయ్యాడు. రెండు రోజుల క్రితం మళ్లీ తీవ్ర అనారోగ్యానికి గురవ్వడంతో తిరిగి ఆస్పత్రిలో చేర్పించారు.దీనితో ఆరోగ్య పరిస్థితి మరింత విషమించడంతో ఆదివారం ఉదయం ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ప్రకటించారు. ఆయన మృతి పట్ల పలువురు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు.